Search

YSR a Legend

Monday, September 7, 2009

Childhood pictures of YSR





Saturday, September 5, 2009

Rajiv gandhi

రాజీవ్‌ గాంధీ.....


రాజీవ్‌గాంధీని అత్యంతగా అభిమానించే వైఎస్‌ రాజీవునిలానే దుర్మరణానికి గురయ్యారు. అప్పట్లో ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు మానవబాంబును ప్రయోగించి రాజీవ్‌గాంధీని బలితీసుకున్నారు. అసలు రాజకీయాలంటేనే గిట్టని రాజీవ్‌ తల్లి ఇందిరాగాంధీ మరణంతో తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. తర్వాత ఆయన చరిష్మాతో పేదల మనసులకు దగ్గరయ్యారు.

రాజీవ్‌గాంధీకి కుమారుడు, కుమార్తె ఉన్నట్లే రాజశేఖరరెడ్డికి కూడా కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజీవ్‌ కుమారుడు రాహుల్‌ ఇప్పుడు కేంద్ర రాజకీయాలలో చురకుగా పాల్గొంటున్నాడు. కాబోయే ప్రధానిగా అపార అనుభవాన్ని కూడగట్టుకుంటున్నారు. వైఎస్‌ కుమారుడు జగన్‌ ఈ మధ్యే ఎంపీగా గెలిచారు. త్వరలో రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్రను పోషించనున్నారు. 

YSR

వైఎస్‌ రాజశేఖర రెడ్డి.....


గాంధీ సిద్ధాంతాలను మనసా,వాచా,కర్మణా నమ్మి ఆచరించే వైఎస్‌ నాటి స్వాతంత్య్రోద్యమంలో కూడా గాంధీ, నెహ్రూల పల్లెబాటే స్ఫూర్తిగా తీసుకున్నారు. దాదాపు 1700 కిలోమీటర్ల దూరాన్ని తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక మండుటెండలో చెమటోడ్చి సాగించారు. ఊరుఊరిలో ప్రజలమధ్య మమేకమై తిరుగుతూ అక్కడి జనాల బాధలను స్వయంగా తెలుసుకున్నాడు. ప్రజల అవసరాలను బాగా అర్థం చేసుకున్నాడు. ఆ పాదయాత్రల అంతరంగం నుంచి పుట్టుకొచ్చినవే ఆయన ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు. ప్రజాకర్షక పథకాలు అనేకన్నా వాటిని ప్రజోపయోగ పథకాలు అంటే బాగుంటుందేమో. రెండు రూపాయల పథకం ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అటువంటి పథకాలను పెద్దగా పట్టించుకోలేదు.

వైఎస్‌ కేంద్రాన్ని మభ్యపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కేట్లు లేవని అధిష్టానానికి కొందరు తప్పుడు సంకేతాలు అందించారు. వైఎస్‌ అన్నింటికీ మౌనంగా విని ఓ చిరునవ్వు నవ్వేసేవారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ఊహించని రీతిలో అధికారపగ్గాలు చేపట్టింది. వైఎస్‌ను తిరుగులేని నాయకుని చేసింది. తన తొలి సంతకాన్ని తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై ప్రజాసమక్షంలో సంతకంచేశారు వైఎస్‌. ఎన్‌టీఆర్‌లానే తాను కూడా ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన సదస్సులో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

నాడు ఎన్టీఆర్‌ తొలి సంతకాన్ని ఇదే స్టేడియంలో రెండురూపాయల బియ్యం పథకం ఫైల్‌మీద చేస్తే వైఎస్‌ ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేయడం విశేషం. ఆ తర్వాత మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, అభయహస్తం వంటి పథకాలను అమలుచేసి పేదల పక్షపాతి అయ్యారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడే మనిషి వైఎస్‌. కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని సంతరించిపెట్టారు. గ్రూపుతగాదాలు, గొడవలు, ముఠాతత్వాలు, స్వార్థం, సంకుచిత్వం వంటి లక్షణాలతో ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులు ఇగో ప్రదర్శించేవారు. వీళ్ల అనైక్యత చూసి ప్రజలందరికీ వెగటుకలిగింది. నాయకత్వలోపం ప్రస్ఫుటంగా కనిపించింది.

అలాంటి స్థితిలో వైఎస్‌ ఆపద్బాంధవుడల్లే పార్టీకి దిక్కయ్యారు. అందరినీ ఒక త్రాటిపైకి తెచ్చి అవసరమొస్తే కాంగ్రెస్‌వాదులంతా ఒక్కటే అనే నినాదాన్ని ఇచ్చి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని రేకెత్తించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పర్యవేక్షించి కిందిస్థాయి కార్యకర్తను కూడా భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవారు. తనని నమ్మినవారిని కడదాకా గుర్తుంచుకునేవారు. తన ఆంతరంగిక మిత్రుడైన కెవీపీ రామచంద్రరావుకు సముచిత స్థానం కల్పించి అసలైన మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచారు. తన తండ్రి స్వర్గీయ రాజారెడ్డికి అనుంగు అనుచరుడైన సూరిని తన ఆంతరంగిక అనుచరుడిగా దగ్గరే ఉంచుకుని కడదాకా తన వెన్నెంటే ఉంచుకున్న దయామయుడు వైఎస్‌. నమ్మితే ప్రాణం ఇవ్వడం వైఎస్‌ నైజం.

NTR

నందమూరి తారక రామారావు


ప్రజానేతలుగా పేరు తెచ్చుకున్నవారంతా పేదలకోసం పాటుపడినవారే కావడం విశేషం. తన సినీగ్లామర్‌తో పౌరాణిక పాత్రలలో జీవించేసి తానే దేవుడు అనేలా భ్రమింపజేసి సామాన్య సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆరాధ్యదేవుడయ్యారు నందమూరి తారక రామారావు. ఎన్‌టీఆర్‌ అనే ఆ మూడక్షరాలకు ఎంతటి పవరుందోకానీ మరొకరయితే తన పేరును ఏదోలా క్యాష్‌ చేసుకునేవారే. కానీ ఎన్టీఆర్‌ ఒక పక్క సినిమాలలో నటిస్తూనే తుపానులు, వరదలు వంటి ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు జోలెపట్టి సామాన్య ప్రజలనుంచి విరాళాలు సేకరించి, కొంత భాగం తాను కూడా సాయం అందించి తన ఉదారతను చాటుకునేవారు. తర్వాత మంచి ఆదాయం వచ్చే సినిమాలను పక్కనపెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుతున్న ఆంధ్రనాయకులపై కళ్లెర్రజేసి సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించారు.

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ ఆశయాలు పేదవారిని, అన్నార్తులను బాగా ఆకట్టుకున్నాయి. మాస్‌ లీడర్‌గా అప్పటికే సినీసామ్రాజ్యంలో తన ముద్రను వేసిన ఎన్‌టీఆర్‌ రాజకీయ రంగం లోనూ అంతకుమించిన మాస్‌ లీడర్‌గా ఎన్నికయ్యారు. మూడుసార్లు ముఖ్య మంత్రిగా ప్రమాణం ప్రజల సమక్షంలో బాహాటంగా చేశారు. ఎల్‌బీ స్టేడియంలో అభిమానుల సమక్షంలో అలా ప్రమాణం చేసి తనలోని పారదర్శకతను చాటుకున్నారు. తొలి సంతకాన్ని రెండురూపాయల కిలోబియ్యం పథకం ఫైలుపై చేశారు. నాటి ఎన్నికల వాగ్దానంలో రామబాణంలా పనిచేసిన ఆ పథకం ఎందరో అన్నార్తులకు సేదతీర్చింది. గంజితాగి కడుపునింపుకునే పేదలపాలిట పరమాన్నమే అయింది. అయితే ఇంతగా అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్‌టీఆర్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేక అప్పట్లో చాలా మంది అభిమానులు గుండెపగిలి మరణించారు. దివంగత నేత ఎన్‌టిఆర్‌ పార్థివ దేహాన్ని కూడా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎల్‌బి స్టేడియంలోనే ప్రజల సందర్శనార్థం ఉంచారు అప్పట్లో. ఆయన మరణించినపుడు జనం ఒక మహాసముద్రమై స్వచ్ఛందంగా కదిలివచ్చారు.

Great 3people

ఆ ముగ్గురూ..








ముగ్గురు నేతలూ జనాదరణ పొందినవారే. ముగ్గురి పేర్లు ‘ర’ అనే అక్షరంతో ఆరంభింపబడినవే. ఇందులో రాజీవ్‌గాంధీ, రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందగా, ఎన్‌టీ రామారావు గుండెపోటుతో మరణించారు. ముగ్గురు నేతలకూ కొన్ని సారూప్యాలు ఉన్నాయి.

NO one can beat him

తిరుగులేని నేతగా.
1980 ో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో తొలిసారిగా గ్రామీణాభివృద్ధి శాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వై.ఎస్‌. 1982లో భవనం వెంకట్రామి రెడ్డి హయాంలో కేబినెట్‌ మంత్రిగా ఎకై్సజ్‌ శాఖను నిర్వర్తించారు. తరువాత కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గంలో కూడా విద్యా మరియు ఆరోగ్య శాఖామంత్రిగా పనిచేశారు. 1983లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఘోర పరాజయం పాలైనా గెలుపుబాటలో పయనించి రాష్ట్రంలో బలమైన కాంగ్రేస్‌ అభ్యర్థిగా నిలిచారు. దాంతో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వై.ఎస్‌కు పార్టీ పునరుద్ధరణ బాధ్య తలను అప్పగిస్తూ పిసిసి ప్రెసిడెంట్‌గా నియమించారు. దాంతో చిన్న వయస్సులోనే (34 ఏళ్ళు) పార్టీ బాధ్యతలు చేశారు. 
1984లో జరిగిన పార్లమెంట్‌, 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించ లేకపోయారు. అందువల్ల పిసిసి పదవినుండి వైదొలగాల్సి వచ్చింది. 1989లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు వై.ఎస్‌. ఆ తరువాత ఇదే నియోజక వర్గం నుండి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1992లో వై.ఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అందినట్టే అంది చేజారిపోయింది. మెడికల్‌, డెంటల్‌ కాలేజీల అనుమతి కేసులో రాష్ట్ర హైకోర్టు అప్పటి ముఖ్యమంత్రి నేదుమల్లి జనార్ధన్‌ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో పదవినుండి వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత అందరు వైఎస్సే ముఖ్య మంత్రి అనుకున్నారు.

అయితే అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితుడవ్వ డంతో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డిని వరించింది. అయితే 1999లో కాంగ్రెస్‌ అధినేత్రి సో నియా గాం ధీ రాష్ట్ర కాంగ్రెస్‌ సారథ్యాన్ని మళ్లీ వై.ఎస్‌కు అప్పగించారు. అయితే తెలుగుదేశంపార్టీ బీజేపీతో జతకట్టడంతో వారి విజయాన్ని ఆపలేకపోయారు. 2003లో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన రాజశేఖర రెడ్డి పాదయాత్రలతో 1600 కిలోమీటర్లు పర్యటించి రాష్ట్ర ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలను దగ్గరి నుంచి తెలుసుకొని అందరి హృదయాలను చూరగొన్నారు.

ఉచిత విద్యుత్తు నినాదంతో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేసి చేతల ముఖ్యమంత్రిగా ప్రజల మనసుల్లో స్థానం పొందారు. జలయజ్ఙం, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్‌ గృహకల్ప, అభయ హస్తం, పావలా వడ్డీలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి జనహృదయ నేతగా పేరొంది రెండవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చి అధిష్టానం వద్ద తిరుగులేని నేతగా పేరు గడించారు.

రెండవ పర్యాయం ముఖ్య మంత్రి అయిన వెంటనే తన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి, తాను చేపట్టిన పథకాలు ప్రజలకు అందు తున్నాయో లేదోనని తెలుసుకోవడానికి తపన పడ్డారు. అందులో భాగంగానే రచ్చబండ కార్యక్రమాన్ని రూపొం దించి గ్రామాలను పర్యటించాలని సంకల్పించిన రాజ శేఖర రెడ్డి విధి వక్రించడంతో తొలి రచ్చబండ పర్యట నలోనే దుర్మరణం పాలై రాష్ట్ర ప్రజానీకాన్ని శోకస ముద్రంలో ముంచారు.అకుంఠిత కార్యదక్షత కలిగిన నాయకుడిగా జనహృ దయ నేతగా ఎదిగిన రాజశేఖరుడు లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది అనటంలో ఎటువంటి సందేహం లేదు.


His political fever

రాజకీయ అరంగ్రేటం...


ఎమ్‌.ఆర్‌. మెడికల్‌ కాలేజీలో చదువుతున్నప్పుడే కాలేజీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఉన్నప్పుడే రాజీకయాలవైపు అడుగులువేశారు రాజశేఖర రెడ్డి. కాలేజ్‌ ‘హౌజ్‌ సర్జన్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడిగా కాలేజీ తరుపున అనేక ఉద్యమాలలో చురుకుగా పాలుపంచుకునేవారు. 1971లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్న రాజశేఖర రెడ్డికి ఒక కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి, కుమార్తె షర్మి సంతానం. కొన్నాళ్ళకు వైద్య వృత్తి స్వస్తి చెప్పిన రాజశేఖర రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. గ్రామస్థాయినుండి అంచెలంచెలుగా ఎదుగుతూ... 1975లో కడప యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రాజశేఖర రెడ్డి ఇక అప్పటినుండి వెనుదిరిగి చూసుకోలేదు. 
1978లో పులివెందుల నియోజక వర్గం నుండి కాంగ్రెస్‌ టిక్కెట్‌ పొందిన వై.ఎస్‌ ఇప్పటికి ఆ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. అనతికాలంలోనే మంచి రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. 1983లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సీట్లు కైవసం చేసుకొని కేవలం పది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విషయం తెలిసింది. అంత ప్రభంజనాన్ని సైతం తట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు డా. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా, జిల్లా ప్రజల్లో చెరగని ముద్రవేశారు. పెద్ద పల్లెటూరుగా పేరుపొందిన కడప జిల్లాను తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశారు. అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేసి నేడు కడప జిల్లాను ఒక పారిశ్రామిక కేంద్రంగా మలిచా

His childhood

బాల్యం..



జూలై 8, 1949వ సంవత్సరంలో ‘జమ్మలమడుగు మిషన్‌ ఆసుపత్రి’లో జన్మించారు డా. ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. ఆయన స్వగ్రామం పులివెందుల. తండ్రి వై.ఎస్‌.రాజారెడ్డి, తల్లి జయమ్మ. వై.ఎస్‌.రాజారెడ్డి కర్ణాటకలోని బళ్ళారిలో కొన్నాళ్ళు కాంట్రాక్టర్‌గా పనిచేశారు. దాంతో రాజశేఖరరెడ్డి బాల్యం, ప్రాథమిక విద్య అంతా బళ్ళారిలోనే గడిచింది. విజయవాడలోని ‘లయోలా కాలేజ్‌’లో ప్లస్‌టూ పూర్తి చేసుకున్న వై.ఎస్‌. గుల్బర్గా విశ్వవిద్యాలయ అనుబంధ వైద్య కళాశాల ‘మహదేవప్ప రాంపూర్‌ మెడికల్‌ కాలేజ్‌’ నుండి వైద్య విద్యలో పట్టభద్రు డయ్యారు. ఆ తరువాత తిరుపతిలోని ‘శ్రీ వేంకటేశ్వర మెడికల్‌ కాలేజ్‌’లో హౌజ్‌ సర్జన్‌గా చేశారు.

అటుపిమ్మట తనకు జన్మనిచ్చిన ‘జమ్మలమడుగు మిషన్‌ ఆసుపత్రి’లోనే డాక్టర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. కొంతకాలం కడపలో కూడా ప్రాక్టీస్‌ ప్రాక్టీస్‌ చేశారు. తరువాత తన కుమారుడికోసం పులివెందులలో ఒక ఆసుపత్రి నిర్మించారు. వై.ఎస్‌.రాజారెడ్డి ఆ ఆసుపత్రి ఇప్పటికీ విధులు నిర్వహిస్తోంది. ఇదే కాకుండా పులివెందులలో ఒక పాలిటెక్నిక్‌ కళాశాలను సైతం స్థాపించారు. తరువాత ఆ కళాశాలను ‘లయోలా గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌’ యాజమాన్యానికి అప్పగించారు. పులివెందుల సమీపంలోని సింహాద్రిపురంలో ఒక జూనియర్‌ కళాశాలను కూడా నెలకొల్పారు. వై.ఎస్‌. కుటుంబం ఈ కాలేజీ బాగోగులను చూసుకుంటుంది.

At Lal bahudur stadium(L.B)

On the way to LB stadium







Telugu tali fly over

Pictures taken at Camp office