His childhood
బాల్యం..
జూలై 8, 1949వ సంవత్సరంలో ‘జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి’లో జన్మించారు డా. ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. ఆయన స్వగ్రామం పులివెందుల. తండ్రి వై.ఎస్.రాజారెడ్డి, తల్లి జయమ్మ. వై.ఎస్.రాజారెడ్డి కర్ణాటకలోని బళ్ళారిలో కొన్నాళ్ళు కాంట్రాక్టర్‌గా పనిచేశారు. దాంతో రాజశేఖరరెడ్డి బాల్యం, ప్రాథమిక విద్య అంతా బళ్ళారిలోనే గడిచింది. విజయవాడలోని ‘లయోలా కాలేజ్’లో ప్లస్‌టూ పూర్తి చేసుకున్న వై.ఎస్. గుల్బర్గా విశ్వవిద్యాలయ అనుబంధ వైద్య కళాశాల ‘మహదేవప్ప రాంపూర్ మెడికల్ కాలేజ్’ నుండి వైద్య విద్యలో పట్టభద్రు డయ్యారు. ఆ తరువాత తిరుపతిలోని ‘శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్’లో హౌజ్ సర్జన్‌గా చేశారు.
అటుపిమ్మట తనకు జన్మనిచ్చిన ‘జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి’లోనే డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కొంతకాలం కడపలో కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేశారు. తరువాత తన కుమారుడికోసం పులివెందులలో ఒక ఆసుపత్రి నిర్మించారు. వై.ఎస్.రాజారెడ్డి ఆ ఆసుపత్రి ఇప్పటికీ విధులు నిర్వహిస్తోంది. ఇదే కాకుండా పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను సైతం స్థాపించారు. తరువాత ఆ కళాశాలను ‘లయోలా గ్రూప్ ఆఫ్ ఎడ్యకేషనల్ ఇనిస్టిట్యూషన్స్’ యాజమాన్యానికి అప్పగించారు. పులివెందుల సమీపంలోని సింహాద్రిపురంలో ఒక జూనియర్ కళాశాలను కూడా నెలకొల్పారు. వై.ఎస్. కుటుంబం ఈ కాలేజీ బాగోగులను చూసుకుంటుంది.


0 comments:
Post a Comment