Rajiv gandhi
రాజీవ్ గాంధీ.....
రాజీవ్‌గాంధీని అత్యంతగా అభిమానించే వైఎస్ రాజీవునిలానే దుర్మరణానికి గురయ్యారు. అప్పట్లో ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు మానవబాంబును ప్రయోగించి రాజీవ్‌గాంధీని బలితీసుకున్నారు. అసలు రాజకీయాలంటేనే గిట్టని రాజీవ్ తల్లి ఇందిరాగాంధీ మరణంతో తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. తర్వాత ఆయన చరిష్మాతో పేదల మనసులకు దగ్గరయ్యారు.
రాజీవ్‌గాంధీకి కుమారుడు, కుమార్తె ఉన్నట్లే రాజశేఖరరెడ్డికి కూడా కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజీవ్ కుమారుడు రాహుల్ ఇప్పుడు కేంద్ర రాజకీయాలలో చురకుగా పాల్గొంటున్నాడు. కాబోయే ప్రధానిగా అపార అనుభవాన్ని కూడగట్టుకుంటున్నారు. వైఎస్ కుమారుడు జగన్ ఈ మధ్యే ఎంపీగా గెలిచారు. త్వరలో రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్రను పోషించనున్నారు.

0 comments:
Post a Comment