NO one can beat him
తిరుగులేని నేతగా.
1980 ో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో తొలిసారిగా గ్రామీణాభివృద్ధి శాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వై.ఎస్. 1982లో భవనం వెంకట్రామి రెడ్డి హయాంలో కేబినెట్ మంత్రిగా ఎకై్సజ్ శాఖను నిర్వర్తించారు. తరువాత కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గంలో కూడా విద్యా మరియు ఆరోగ్య శాఖామంత్రిగా పనిచేశారు. 1983లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఘోర పరాజయం పాలైనా గెలుపుబాటలో పయనించి రాష్ట్రంలో బలమైన కాంగ్రేస్ అభ్యర్థిగా నిలిచారు. దాంతో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వై.ఎస్‌కు పార్టీ పునరుద్ధరణ బాధ్య తలను అప్పగిస్తూ పిసిసి ప్రెసిడెంట్‌గా నియమించారు. దాంతో చిన్న వయస్సులోనే (34 ఏళ్ళు) పార్టీ బాధ్యతలు చేశారు.
1984లో జరిగిన పార్లమెంట్, 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించ లేకపోయారు. అందువల్ల పిసిసి పదవినుండి వైదొలగాల్సి వచ్చింది. 1989లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు వై.ఎస్. ఆ తరువాత ఇదే నియోజక వర్గం నుండి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1992లో వై.ఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అందినట్టే అంది చేజారిపోయింది. మెడికల్, డెంటల్ కాలేజీల అనుమతి కేసులో రాష్ట్ర హైకోర్టు అప్పటి ముఖ్యమంత్రి నేదుమల్లి జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో పదవినుండి వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత అందరు వైఎస్సే ముఖ్య మంత్రి అనుకున్నారు.
అయితే అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితుడవ్వ డంతో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డిని వరించింది. అయితే 1999లో కాంగ్రెస్ అధినేత్రి సో నియా గాం ధీ రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యాన్ని మళ్లీ వై.ఎస్‌కు అప్పగించారు. అయితే తెలుగుదేశంపార్టీ బీజేపీతో జతకట్టడంతో వారి విజయాన్ని ఆపలేకపోయారు. 2003లో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన రాజశేఖర రెడ్డి పాదయాత్రలతో 1600 కిలోమీటర్లు పర్యటించి రాష్ట్ర ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలను దగ్గరి నుంచి తెలుసుకొని అందరి హృదయాలను చూరగొన్నారు.
ఉచిత విద్యుత్తు నినాదంతో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేసి చేతల ముఖ్యమంత్రిగా ప్రజల మనసుల్లో స్థానం పొందారు. జలయజ్ఙం, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప, అభయ హస్తం, పావలా వడ్డీలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి జనహృదయ నేతగా పేరొంది రెండవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చి అధిష్టానం వద్ద తిరుగులేని నేతగా పేరు గడించారు.



0 comments:
Post a Comment